Asaduddin Owaisi: AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంపై జిహాద్ పేరిట హత్యలు చేయాలని పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు నొప్పి..
ఇకపోతే, భారత వైమానిక దళాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించిన మరుసటి రోజు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అన్ని పార్టీల సమావేశంలో ఓవైసీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించిన భారత సాయుధ దళాలకు, ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే TRF పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రచారం ప్రారంభించాలని, అమెరికా కూడా దీన్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు.
Read Also: HYDRAA Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!
ఇక ఫిబ్రవరిలో హఫీజ్ అబ్దుర్ రౌఫ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ‘ఈ ఏడాది జిహాద్ చేయాలి’ అని అన్నారని ఆయన గుర్తు చేసారు. ‘జిహాద్’ పేరిట భారతదేశంలో హత్యలు, భయోత్పాతం సృష్టించడమే వారి లక్ష్యమని, పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్ లో చేర్చాలని ఆయన కోరారు. అలాగే UK ప్రభుత్వం కూడా TRFను నిషేధించి పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించాలని ఓవైసీ తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కశ్మీరీ ప్రజలను భారత్‌కు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని, పూంఛ్‌లో పౌరులు హత్యకు గురవడం, ఉరి ప్రాంతంలో ప్రజలు తమ ఇల్లు కోల్పోవడం తీవ్ర విషాదకరం అని తెలిపారు. అలాగే ఘటనలో బాధితులను ఉగ్రవాద ఘటనల బాధితులుగా గుర్తించి, వారికి తగిన పరిహారం అందించాలని అలాగే వారి ఇళ్లను తిరిగి నిర్మించాలని.. కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
पाकिस्तानी आतंकवादी जिहाद का नाम लेकर भारत में आतंक फैलाना चाहते हैं Operation Sindoor पर बुलाई गई सर्वदलीय बैठक में हिस्सा लेने के बाद मीडिया से मेरी बातचीत।pic.twitter.com/Xc14vo3gO4
— Asaduddin Owaisi (@asadowaisi) May 8, 2025