Operation Sindoor 2: భారత్-పాకిస్థాన్ మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి.. ఓవైపు, పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. మరోవైపు.. ఆ దేశంపై విరుచుకుపడుతోంది భారత్.. దీంతో, పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.. నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్‌కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్‌లో 50కి పైగా పాక్ డ్రోన్‌లను విజయవంతంగా తటస్థీకరించింది..
Read Also: Samba : సాంబా సెక్టార్‌లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం
L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు మరియు ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలను విస్తృతంగా ఈ ఆపరేషన్‌లో ఉపయోగించినట్టు తెలుస్తుండగా.. ఇది వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి భారత సైన్యం యొక్క బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతున్నారు.. అయితే, పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 8 మరియు 9 తేదీల మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి దాడులకు పాల్పడింది.. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కూడా అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడుతూ వస్తోంది.. అయితే, పాక్ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత్.. వారికి తగిన సమాధానం ఇస్తోంది..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇక, పాకిస్తాన్ డ్రోన్ దాడులపై భారత్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్లతో దాడిచేసింది.. జమ్మూకశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. పాక్‌కు గట్టిగా జవాబు ఇచ్చాం.. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం.. పాక్ కుట్రలన్నింటికీ దీటుగా జవాబిస్తాం అని భారత ఆర్మీ తన ప్రకటనలో పేర్కొంది..