India Pakistan War: పెహల్గామ్ ఉద్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది భారత్.. కానీ, భారత్‌పై ఎదురుదాడికి దిగుతోంది పాకిస్తాన్.. ఓవైపు.. పాక్‌కు ప్రతిఘటిస్తూనే.. మరోసారి గట్టిసమాధానం చెబుతూ.. పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ వణికిపోయేలా చేసింది భారత భద్రతా వ్యవస్థ.. 50కి పైగా పాక్ డ్రోన్లను కూల్చివేసింది భారత్.. అయితే, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్‌లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
Read Also: Kayadu Lohar : కయాదు లోహర్ ఎంత క్యూట్ గా ఉందో..
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో.. సరిహద్దు జిల్లాలపై పాక్ వైపు నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని చండీగఢ్‌లో మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దాడులు జరిగే అవకాశం ఉందంటూ.. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరిక జారీ చేసింది.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించింది. బాల్కనీల్లోకి కూడా రావొద్దని స్పష్టం చేసిన తరుణంలో చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు.. మరోవైపు.. రాత్రి జరిగిన పాకిస్తాన్ డ్రోన్ దాడులపై భారత్ ఆర్మీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్లతో దాడిచేసింది.. జమ్మూ కాశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. కానీ, పాక్‌కు గట్టిగా జవాబు ఇచ్చాం.. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం.. పాక్ కుట్రలన్నింటికీ దీటుగా జవాబిస్తాం అంటూ భారత ఆర్మీ తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే..