ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.
India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్‌ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో…
High Alert In Taj Mahal: భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలెర్ట్ జారీ చేసింది. కీలకమైన ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచింది.
జమ్ముకశ్మీర్ లోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాకిస్తాన్ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది.
సహరిద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ.. బ్లాకౌట్‌లు ప్రకటిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, ఈ సమయంలో మీ ఫోనే.. మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది.. Androidతో పాటు iPhoneలలో అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తోంది.. ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్ ఛానెల్‌ని ఉపయోగిస్తారు.. నెట్‌వర్క్‌లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. మనం చేయాల్సిందల్లా.. మన ఫోన్‌లో సెట్టింగ్‌లు కాస్తా మార్చుకుని.. ఆ…
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Fact Check: పాకిస్తాన్ తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్‌బైజన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి.
భారత్- పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులపై ఆమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇరు దేశాలు ఘర్షణలను నివారించడానికి "నిర్మాణాత్మక" చర్చలను ప్రారంభించడానికి అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు.
India Pak War : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంచలన వార్తకు ఫుల్స్టాప్ పెట్టింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజనిర్ధారణ విభాగం. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో దాదాపు 10 పేలుళ్లు సంభవించాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB తేల్చి చెప్పింది. అల్ జజీరా ఇంగ్లీష్ ప్రచురించినట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక నివేదికలో, విమానాశ్రయం పరిసరాల్లో వరుస పేలుళ్లు జరిగాయని తప్పుగా పేర్కొన్నారు. ఈ వార్త క్షణాల్లో…