India Pakistan War: పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను మరోసారి బ్లాకౌట్ చేశారు. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. సుమారు 11 లొకేషన్లలో దాడులకు దిగింది పాకిస్తాన్. ఈ సందర్భంగా జమ్మూలోని పలు నగరాలే టార్గెట్‌గా పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులను భారత భద్రతా దళాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్, జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్, పోఖ్రాన్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.
Read Also: India-Pak War : నిత్యవసర సరుకులపై ఆందోళన వద్దు.. కేంద్ర కీలక సూచన
ఇక, ఎల్‌వోసీ సరిహద్దుల్లో యుద్ధ సైరన్ మోగించినట్లు సమాచారం. మరోవైపు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సర్వీసులను బంద్ చేసింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌కు ఈనెల 15వ తేదీ సుమారు 24 ఎయిర్ పోర్టులను బంద్ చేస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది.