Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
అయితే, శుక్రవారం రాత్రి డ్రోన్ దాడి జరుగుతున్న సమయంలో ఐబీ, ఎల్ఓసీ సమీపంలో దాదాపుగా 100 కంటే ఎక్కువ పౌర విమానాలు ప్రయాణిస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ విమానాశ్రయాల్లో పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్ , టేకాఫ్ అవుతున్నట్లు డేటా చూపించింది. దీనిని బట్టి చూస్తే వీటిని ఒక రక్షణగా ఉపయోగించుకుని పాక్ దాడికి తెగబడింది. ఒక వేళఈ దాడిన అడ్డుకునేందుకు భారత్ ఎయిర్‌పోర్టులపై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాని చూస్తోంది.
Read Also: Pak drone attacks: 20కి పైగా నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు..
లాహోర్ విమానాశ్రయం అంతర్జాతీయ సరిహద్దు నుండి 17 కి.మీ దూరంలో ఉండగా, కరాచీ 173 కి.మీ దూరంలో ఉంది మరియు ఇస్లామాబాద్ విమానాశ్రయం నియంత్రణ రేఖ నుండి 133 కి.మీ దూరంలో ఉంది. ఎతిహాద్, ఎమిరేట్స్, ఫ్లైనాస్, ఖతార్ ఎయిర్ వేస్, ఎయిర్ అరేబియా, గల్ఫ్ ఎయిర్, జజీరా వంటి విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 39 విమానాలు పాక్ గగనతలంలో ఉన్నాయి. భారత్ దాడి చేయకుండా ఈ విమానాలను పాక్ ఒక కవచంలా వాడుకుంటోంది.
అంతకుముందు, శుక్రవారం జరిగిన భారత విదేశాంగ శాఖ మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. దాడులు చేసే సమయంలో కనీసం పాక్ తన గగనతలాన్ని మూసివేయడం లేదని, పౌర విమానాలను ఒక రక్షణగా వాడుకుంటోందని వారు ఆధారాలతో చెప్పారు. అయినా కూడా ఈ రోజు పాకిస్తాన్ మరోసారి ఇదే పనిచేసింది.