Indus Waters Treaty: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌కు సింధూ జలాలను ఆపేస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు తమకు నీటిని రిలీజ్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఇండియాను బతిమిలాడుతుంది. తమ దేశానికి నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా భారత్ ని కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని పేర్కొనింది.
Read Also: Heavy Rains Alert: బంగాళాఖాంతంలో అల్ప పీడనం.. మరో ఆరు రోజులు భారీ వర్షాలు..!
అయితే, భారత్‌పై అణు హెచ్చరికలను జారీ చేస్తూ పాక్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ అనేది హైవేపై వస్తున్న ఒక కారులాంటిది. కానీ, పాకిస్థాన్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది అని పోల్చారు. ఒకవేళ కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరికి నష్టం? అని తన ప్రసంగంలో అతడు పేర్కొన్నాడు. ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం భారత్‌పై చిల్లర వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తే.. యుద్ధం చేయడం తప్ప మరో మార్గం లేదని గప్పలు కొట్టాడు. వీరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ నీటిని విడుదల చేయాలని భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం.
Read Also: ZPTC Elections :ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి కౌంటర్
కాగా, 1960ల్లో భారత్- పాకిస్థాన్ సింధూ నదీ జలాల ఒప్పందం చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును ఇండియా నిలిపివేయడంతో దాయాది దేశానికి నీటి సమస్య ఎక్కువ అయింది. పాక్ లోని జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా దిగజారిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని స్థితి కొనసాగుతుంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్‌లో నీటి ప్రవాహం సుమారు 15 శాతం మేర తగ్గిపోయింది. ఎండాకాలంలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్‌లో మరిన్ని కష్టాలు తప్పవని దాయాది దేశ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉగ్రవాదంపై పాక్ తీరు మార్చుకునే వరకూ సింధూ జలాల నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది.