Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది.
బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు.
China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్‌తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్‌కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్‌ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు.
చైనా-భారత్ మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతున్న తరుణంలో మరోసారి డ్రాగన్ దేశం హద్దులు దాటింది. లడఖ్ సరిహద్దులో చైనా రెండు స్థావరాలను ఏర్పాటు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
India-China: భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకురావడానికి రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
China: సరిహద్దు వివాదంపై భారత్- చైనాల మధ్య దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి. ఈక్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ చెప్పుకొచ్చారు.
India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు.
Chenab Bridge : ఒకటి చేదు, మరొకటి వేపచెట్టు... పాకిస్థాన్, చైనాల మధ్య జరిగే జుగల్బందీ ఇలా ఉంటుంది. భారత్‌పై ఇరుదేశాల కార్యకలాపాలు ఇప్పటికీ తగ్గుముఖం పట్టడం లేదు.
లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు, సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్, ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య, దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
India-China Border: భారత్- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.