India-China: వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణలో భారత్, చైనాలు కొంత మేర పురోగతి సాధించాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది స్వాగతించ దగ్గ విషయం అన్నారు. ఇక, ఆదివారం నాడు ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో మా (భారత్-చైనా) మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని మీ అందరికి తెలుసు అని చెప్పుకొచ్చారు. బలగాల ఉపసంహరణలో ఇరు కొంత పురోగతి సాధించాయి.. 2020కు ముందు లేనిస్థాయిలో ఎల్ఏసీ వెంబడి భారీగా డ్రాగన్ కంట్రీ చైనా తన బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది.. దానికి ప్రతిగా తాము భద్రతా బలగాలను మోహరించామని జైశంకర్ వెల్లడించారు.
Read Also: Wriddhiman Saha Retirement: క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా వికెట్ కీపర్
కానీ, ఈ సమస్య వల్ల ఇతర అంశాల్లోనూ మా (ఇండియా- చైనా) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. బలగాల ఉపసంహరణ తర్వాత మా సంబంధాలు ఏ దిశలో వెళ్తాయనేది వేచి చూడాలన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం పైనా కూడా జైశంకర్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ఈ యుద్ధం విస్తరించకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా నేరుగా మాట్లాడుకోకపోవడం వల్లే ఇంత పెద్ద వార్ కొనసాగుతుంది.. దీన్ని తగ్గించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని భాకత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.