China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్‌తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్‌కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్‌ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు.
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశం తర్వాత శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయడం మాత్రమే సరైన ఛాయిస్’’ అని అన్నారు. ఒకరినొకరు అణచివేయడానికి బదులుగా, మద్దతు, సహకారాన్ని బలోపేతం చేయడం, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నిలిచే బదులుగా, మా ప్రాథమిక ఆసక్తులు ఉన్నాయి అని అన్నారు. ఆసియాలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిస్తే, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామ్యీరణ, గ్లోబల్ సౌత్ అభివృద్ధి, రెండు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. 2025 నాటికి చైనా-భారత్ దౌత్య సంబంధాలు 75వ వార్షికోత్సవం అవుతాయని వాంగ్ అన్నారు.
Read Also: IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో లైవ్ స్ట్రీమింగ్
“రెండు పురాతన నాగరికతలుగా, సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన పరిష్కారం లభించే వరకు సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతతను కొనసాగించడానికి మాకు తగినంత జ్ఞానం మరియు సామర్థ్యం ఉన్నాయి” అని పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) యొక్క శక్తివంతమైన రాజకీయ బ్యూరో సభ్యుడు అయిన వాంగ్ యీ ఈ వ్యా్ఖ్యలు చేయడంతో చైనా స్వరం మారినట్లు తెలుస్తోంది.
అయితే, చైనా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించలేదు. గురువారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం చైనాతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. చైనా నియంత్రిత ప్రదేశాలకు తీర్థయాత్రలు ప్రారంభించడం, ప్రత్యక్ష విమానాల వంటి చర్యలు ఉంటాయని చెప్పారు.