India-China Border: లద్దాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ..
- లద్దాఖ్‌లో భారత్- చైనా బలగాల ఉపసంహరణ..
- డెమ్చోక్- డెస్పాంగ్ నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లినట్లు వెల్లడి..
- టెంట్లు.. తాత్కాలిక నిర్మాణాలను ఇరుదేశాలు తొలగిస్తున్నాయి: భారత రక్షణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-China Border: భారత్- చైనా దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లినట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఈరోజు (శుక్రవారం) తెలిపారు.
Read Also: Minister Narayana: దాచేపల్లిలో డయేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇక, ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. చార్దింగ్ లా పాస్‌కు సమీపంలోని నదికి పశ్చిమదిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కివెళ్తున్నట్లు తెలిపాయి. ఈప్రాంతాల్లో సరిహద్దులకు ఇరు వైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు నిర్మించినట్లు సమాచారం. బలగాల ఉపసంహరణ ప్రక్రియంతా పూర్తైన తర్వాత మరో 4-5 రోజుల్లో డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించబోతున్నట్లు వెల్లడించారు.
కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం.. ఎల్‌ఏసీ వెంబడి 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి కొనసాగనున్నాయి. భారత్- చైనా దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో ఇరు దేశాల నేతలు ప్రధాని మోడీ, జిన్ పింగ్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!