India-China: భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకురావడానికి రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
5 ఏళ్ల తర్వాత ప్రత్యేక ప్రతినిధుల చర్చల 23వ రౌండ్‌లో పాల్గొనేందుకు భారత ప్రతినిధి బృందానికి అజిత్ దోవల్ నేతృత్వం వహించారు. చివరి సమావేశం 2019లో ఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్‌లో వైస్ ప్రెసిడెంట్ హాన్ మాట్లాడుతూ.. చైనా, భారత్ ప్రాచీన నాగరికతలు, అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తులుగా స్వాతంత్య్రం, సంఘీభావం, సహకారానికి కట్టుబడి ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది చైనా, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 75 ఏళ్లు నిండుతాయని హాన్ జెంగ్ పేర్కొన్నారు.
Read Also: Mumbai: ఘోర విషాదం.. బోటు ప్రమాదంలో 13 మంది దుర్మరణం
దీనికి ముందు అజిత్ దోవల్ ఆ దేశ విదేశాంగ ప్రతినిధితో భేటీ అయ్యారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి 6 ఒప్పందాలపై సంతకాలు చేవారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దులో శాంతి నెలకొనాలని నిర్ణయించారు. టిబెల్‌లోని కైలాస్ మానస్‌సరోవర యాత్రను ప్రోత్సహించడంతో పాటు నాథులా బోర్డర్ ట్రేడ్, క్రాస్ బోర్డర్ రివర్ కోపరేషన్‌పై సమోధ్య కుదిరింది.
2020లో తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి గాల్వాన్‌లో సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తు్న్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 3,488 కి.మీ విస్తీర్ణంలో ఉన్న భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి 2003లో ఏర్పాటైన ప్రత్యేక ప్రతినిధులు యంత్రాంగం 22 సార్లు సమావేశమయ్యారు.