Rare Earth Magnet: అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మెటీరియల్)పై చైనా గుత్తాధిపత్యం భారత్‌కి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. భారత్ లో అభివృద్ధి చెందుతున్న ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ల మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తన కొత్త నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా ఈవీ వాహనరంగంలో ఎలక్ట్రిక్ మోటార్లకు కావాల్సిన రేర్ ఎర్త్ అయస్కాంతాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 90శాతం చైనానే ఉత్పత్తి చేస్తోంది.
పరిమాణంలో చిన్నవి, శక్తి అధికం:
రేర్ ఎర్త్ మాగ్నెట్స్ చవకైనవి చవకైనవి అయినప్పటికీ, ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలలో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్లు (PMSMలు) కోసం చాలా ముఖ్యమైనవి. ఇది అధిక టార్క్, శక్తిని అందిస్తాయి. ఈవీలతో పాటు ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ఐసీఈ) వాహనాల్లో కూడా ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అప్లికేషన్స్‌లో, మోటారైజ్డ్ అప్లికేషన్లలో ఇవి చాలా కీలకం. ఇదే కాకుండా రక్షణ పరికరాలు, యుద్ధ విమానాలు, మెడికల్ అప్లికేషన్స్‌లో వీటి పాత్ర చాలా కీలకం.
చైనా గుత్తాధిపత్యం:
చైనా ఇటీవల రేర్ ఎర్త్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌పై ఎగుమతి నిబంధనల్ని అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఎగుమతుల అనుమతులు, తుది వినియోగ ప్రకటన అవసరం. ముఖ్యంగా రక్షణరంగం వాడకాల్లో నిషేధించడం, యూఎస్‌కి తిరిగి ఎగుమతులు పెంచడం చైనా ఉద్దేశంగా కనిపిస్తోంది. దీంతో షిప్ మెంట్స్ దాదాపుగా 45 రోజుల నుంచి ఆలస్యమయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి భారత్ 540 టన్నుల అయస్కాంతాలను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం దిగుమతుల్లో 80 శాతం కన్నా ఎక్కువ. అయితే, ఇప్పుడు చైనా ఆంక్షలతో ఇబ్బందులు పడుతోంది. మే నెలాఖరు నాటికి భారతీయ కంపెనీలు దాదాపు 30 దిగుమతి అభ్యర్థులను ఆమోదించామని, కానీ చైనా అధికారులు వేటిని ఆమోదించలేదని క్రిసిల్ నివేదించింది. ప్రస్తుతం, వాహన తయారీదారులకు 4-6 వారాల బఫర్ స్టాక్ ఉంది. కానీ నిరంతర అంతరాయాలు వాయిదాలు రీషెడ్యూల్‌కి దారి తీయవచ్చు. ముఖ్యంగా ద్విచక్రవాహానలు, ప్యాసింజర్ ఈవీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
భారత్ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి:
2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రయాణీకుల వాహన అమ్మకాలు 2-4% విస్తరించవచ్చని క్రిసిల్ అంచనా వేసింది, అయితే సరఫరా గొలుసులు మూసుకుపోతూ ఉంటే ఎగుమతులు నిలిచిపోతాయి. 27% విస్తరించే అవకాశం ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రమాదంలో పడుతాయి.
ఈ నేపధ్యంలో భారత్ ప్రత్యామ్నాయాల కోసం చూస్తోంది. ప్రత్యామ్నాయ సరఫరాదారులకు మారడం, PLI కార్యక్రమాల కింద దేశీయ మాగ్నెట్ అసెంబ్లీని పెంచడం చేస్తోంది. దీంతో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని అన్వేషించే ప్రక్రియను వేగవంతం చేసింది. దేశీయ తయారీని పెంచడం, రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలను సృష్టించడం వంటివి చేస్తోంది.
అరుదైన మట్టి ఎగుమతులను పొందడానికి బీజింగ్‌తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, చైనా చర్యను “ప్రపంచానికి మేల్కొలుపు పిలుపు”గా అభివర్ణించారు. భారతదేశం ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను సృష్టించడానికి, ప్రపంచ సంస్థలకు నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. భారత్ , రేర్ ఎర్త్ మెటీరియల్స్‌లో గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు కజకిస్తాన్న, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలతో రేర్ ఎర్త్ కోపరేషన్ నిర్వహించింది.