సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు.
నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు.
: భారత్‌పై ప్రమాదకర ప్రణాళికలు రచిస్తున్న చైనా.. ఇప్పుడు భారత్ చుట్టూ పక్క దేశాల్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, చైనా, క్యూబా, స్నేహపూర్వక దేశమైన యూఏఈ, సీషెల్స్, తజికిస్థాన్, టాంజానియా వంటి దేశాలు కూడా సైనిక స్థావరాలను నిర్మించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తాజా నివేదిక వెల్లడించింది.
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
భారత్-చైనా సరిహద్దు సంబంధాలలో కీలక ముందడుగు పడింది. ఇటీవల జరిగిన 16వ విడత చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో కొన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరుదేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.