భారత టీ20 జట్టుకు శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితులైనప్పటి నుంచి ఓపెనర్‌గా ఆడుతున్నాడు. గిల్ రాకతో ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విడిపోయింది. అంతేకాకుండా సంజుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకుండా పోతోంది. దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరిగిన తొలి టీ20కి సంజు దూరమయ్యాడు. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈరోజు జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో కూడా అతడికి చోటు దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గిల్, సంజు ఫామ్ చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్ దృష్ట్యా టెస్ట్, వన్డేలలో రాణించిన శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ సెలెక్టర్లు టీ20ల్లో అవకాశం ఇచ్చారు. గిల్ కోసం ఏకంగా ఓపెనర్‌గా మంచి ఫామ్ మీదున్న సంజు శాంసన్‌ను దిగువన ఆడించారు. ఇప్పుడు ఏకంగా బెంచ్‌లోనే కూర్చోబెడుతున్నారు. గిల్ వరుసగా విఫలమవుతుండడంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే ఒత్తిడి గిల్‌పై రోజురోజుకు పెరుగుతోంది. గత 16 ఇన్నింగ్స్‌లలో గిల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఎనిమిది సార్లు 15 కంటే తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరాడు.
Also Read: Oasis Janani Yatra: వరంగల్ చేరిన ‘ఓయాసిస్ జనని యాత్ర’.. దంపతులకు ఉచిత ఫెర్టిలిటీ సంప్రదింపులు!
టీమిండియా మాజీ టెస్ట్ ఓపెనర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా శుభ్‌మాన్ గిల్ ప్రస్తుత ఫామ్ గురించి ప్రశ్నలు లేవనెత్తారు. మరోవైపు సంజు ఓపెనర్‌గా తన చివరి 12 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు బాదాడు. అయినా కూడా అతడికి తుది జట్టులో అవకాశం రావడం లేదు. ఇక యశస్వి జైస్వాల్ వంటి హిట్టర్ కూడా అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ రాణించకుంటే అంతే సంగతులు. అభిషేక్ శర్మ 2025లో 18 మ్యాచ్‌ల్లో 188.5 స్ట్రైక్ రేట్‌తో 773 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత్ పొట్టి ఫార్మాట్‌లో మరో తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. ఈలోగా కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇష్టమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన గిల్ ఫామ్ తిరిగి అందుకోవాలని కోరుకుంటున్నాడు.