Ind vs SA: న్యూచండీగఢ్ లోని ముల్లాన్‌పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు భారీ పరాజయం మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
Arshdeep Singh చెత్త రికార్డు.. ఒక ఓవర్ లో 13 బంతులు.. 7 వైడ్‌లు.. కోచ్ గంభీర్ ఆగ్రహం!
భారత ఇనింగ్స్ లో శుభ్‌మన్ గిల్ (0), అభిషేక్ శర్మ (17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఓవర్‌లోనే గిల్ డకౌట్ అవ్వగా, సూర్యకుమార్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇలా ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా తెలుగబ్బాయి తిలక్ వర్మ (Tilak Varma) ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మిగిలిన బ్యాటర్ల నుండి సరైన మద్దతు లభించలేదు. అక్షర్ పటేల్ (21), హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (27) స్వల్పంగా పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.
Ind vs SA 2nd T20I: క్వింటన్ డికాక్ విధ్వంసం.. టీమిండియాకు భారీ టార్గెట్..!
ఇక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఒట్నీల్ బార్ట్‌మ్యాన్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. లుంగీ ఎంగిడి (Lungi Ngidi), మార్కో జాన్సెన్ (Marco Jansen) చెరో 2 వికెట్లు, లుథో సిపామ్లా (Lutho Sipamla) 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా, క్వింటన్ డికాక్ (90) విధ్వంసం కారణంగా 213/4 భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/29) మాత్రమే పర్వాలేదనిపించాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరచింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్ ఇప్పుడు 1-1తో సమమైంది.