IND vs SA: భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడు (డిసెంబర్ 11) న్యూ PCA స్టేడియం, ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభమైంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. సొంతగడ్డపై, సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో భారీ ఓటమిని చవిచూసిన దక్షిణాఫ్రికా పుంజుకోవాలని చూస్తోంది.
Satya Kumar Yadav: వాజపేయి అడుగుజాడల్లో రాష్ట్రంలో సుపరిపాలన యాత్ర..
ఇక ప్లేయింగ్ XI విషయానికి వస్తే.. భారత జట్టు ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతోంది. ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ మాదిరిగా దూకుడుగా ఆడుతున్నా శుభ్‌మన్ గిల్ ఫామ్ లేమి ఇబ్బంది పెడుతోంది. అభిషేక్, సంజూ శాంసన్‌లు గతంలో ఓపెనర్లుగా రాణించినప్పటికీ, గిల్‌పై నమ్మకంతో అతడికే ఓపెనర్ గా రానున్నాడు. దీంతో సంజూ శాంసన్‌కు మరోసారి తుది జట్టులో స్థానం దక్కలేదు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. తిలక్ వర్మ, ఆల్‌రౌండర్స్ అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్ భారాన్ని మోయనున్నారు. పాండ్యా బ్యాట్, బాల్‌తో ఆకట్టుకోవడంతో జట్టుకు అదనపు బలంగా మారింది.
CM Chandrababu: ప్రజా సేవ, ప్రచారం రెండూ ముఖ్యమే.. తెలుగు తమ్ముళ్లకు సీఎం దిశానిర్ధేశం..
టీమిండియా ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, జితేష్ శర్మ (wk), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI:
క్వింటన్ డి కాక్ (wk), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (C), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరెయిరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, లూతో సిపంలా, లుంగి ఎంగిడీ, ఓట్ట్నీల్ బార్ట్మాన్.