ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఖంగుతింది. భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యంతో పరాజయం మూటగట్టుకుంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను దక్షిణాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు ఆటగాళ్లు డుస్సెన్ 75 నాటౌట్, డేవిడ్ మిల్లర్ 64 నాటౌట్ చెలరేగి ఆడారు. ఓపెనర్లు డికాక్ (22), బవుమా (10) విఫలమైనా 10 ఓవర్లలో మూడు వికెట్ల…
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషాన్ 76 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోవడంతో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అందాయి. టీమిండియా రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తీక్,…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే తొలి టీ20 జరిగే ఢిల్లీలో రాత్రిపూట కూడా వడగాలులు వీస్తున్నాయి. ఉదయం వేళల్లోనే ఢిల్లీలో ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటోంది. మధ్యాహ్నం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీలను టచ్ చేస్తోంది.…
రేపటి నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో మంచి ఫామ్‌ను కనపరిచిన రాహుల్ జట్టుకు దూరం కావడం…
సుమారు రెండున్నర నెలలపాటు అలరించిన IPL 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అప్‌కమింగ్ భారత్-సౌతాఫ్రికా T20 సిరీస్‌పై నెలకొంది. సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకున్న వేళ ఐపీఎల్లో మెరిసిన స్టార్లతో టీమిండియా సొంతగడ్డపై సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను టీమిండియా…
మొదట్లో కాస్త చప్పగా సాగిన మ్యాచులు , తరువాత ఊపందుకొని చివరి మ్యాచ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్ కి చేసురుకుంటారని తెలియని ఒక ఉత్కంఠతో మొత్తానికి IPL 15వ సా సీజన్ ఘనంగా ముగిసింది. సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన ఆకట్టుకోలేకపోయిన, యువ ఆటగాళ్లు మాత్రం వారి స్థాయికి మించి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు ఎవరిని సెలెక్ట్ చేయాలనీ అందరిని ఒక డైలమాలో పడేసారు . మొత్తానికి BCCI సెలక్షన్ కమిటీకి పెద్ద పరీక్షే పెట్టారు.…
విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం…
టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.. జట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గడ్డపై ఆడలేకపోయారో.. లేక కోవిడ్ టెన్షన్ ఏమైనా పట్టుకుందో తెలియదు కాని.. మన వాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఓటమిపాలయ్యారు.. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. చివరిదైన మూడో వన్డేలోనూ భారత్‌కు అవకాశం ఇవ్వలేదు.. కాకపోతే, ఈ మ్యాచ్ టీమిండియా గొప్ప ఆటతీరును కనబర్చింది.. ఒక రకంగా చెప్పాలంటే పోరాడి ఓడిపోయింది.. Read Also:…
సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా…