విశాఖ టీ20లో దక్షిణాఫ్రికా 48 పరుగుల తేడాతో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటిపై దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా స్పందించాడు. ఒక్క ఓటమికే తమ జట్టును మార్చాలని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని బవుమా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లను ఎదుర్కొన్న తరహాలో మూడో మ్యాచ్‌లో చేయలేకపోయిన మాట వాస్తవమని.. భారత స్పిన్నర్లు తమను కట్టడి చేశారని…
ఎట్టకేలకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు తన సత్తా చాటింది. ఏ పెర్ఫార్మెన్స్ అయితే ముందు నుంచి కోరుకుంటున్నామో.. అలాంటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై తాండవం చేసి, భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అవును, విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 48 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగరేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20…
విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోతుంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే దక్షిణాఫ్రికాకు సిరీస్ సొంతం అవుతుంది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా ఒత్తిడికి గురవుతోంది. సత్తా ఉన్న కుర్రాళ్లు జట్టులో ఉన్నా..…
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ రెండు మ్యాచ్‌లు ముగిసిపోయాయి. రేపు మూడో మ్యాచ్ విశాఖపట్నంలోని డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత్, దక్షిణాఫ్రికా జట్లు విశాఖపట్నంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రుషికొండ బీచ్‌లో మన భారత క్రికెటర్లు కాసేపు సందడి చేశారు. పైగా, బీచ్ రోడ్‌లోని ఓ హోటల్లోనే ఇరు జట్ల క్రీడాకారులు బస చేస్తున్నారు. బీచ్ పక్కనే…
ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఆల్రెడీ భారత్ రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో, ఈ సిరీస్‌లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఈ సిరీస్ నెగ్గాలంటే, భారత్ మిగిలిన మూడు మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత తుది జట్టులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ సూచించాడు. ముఖ్యంగా.. ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకోవాల్సిందిగా సిఫార్సు…
భారీ స్కోరు చేసినా తొలి టీ20 మ్యాచ్ ఓడిపోవడంతో.. రెండో మ్యాచ్ నెగ్గి దక్షిణాఫ్రికాపై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈసారి బ్యాట్స్మన్లు చేతులెత్తేయడంతో ఓటమి చవిచూడక తప్పలేదు. దీంతో.. ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో దఫ్రికాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్లను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు చివరివరకూ ప్రయత్నించారు కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, రిషభ్ పంత్ మాత్రం మరింత మెరుగ్గా బౌలింగ్ వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.…
కటక్ వేదికగా జరిగిన భారత్,దక్షిణాఫ్రికా రెండవ టీ20 లో భారత్ భొక్కబోర్ల పడింది. తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుండే తడపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే గైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ పంత్ కూడా అనవసరపు షాట్ ఆడీ వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ ఇషాంత్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్…
కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగారు.ఇషాన్ కిషన్(34), శ్రేయాస్ అయ్యర్ (40) మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు షాకుల మీదు షాకులు తగిలాయి. రుతురాజ్ గైక్వాడ్ (1), రిషబ్ పంత్ (5), హార్డిక్ పాండ్యా (9), అక్షర్ పటేల్(10) ఇలా వచ్చి అలా వెళ్లారు. టీమిండియా 140…
టీమిండియా ఓటమి చవిచూసినప్పుడల్లా.. కెప్టెన్లపై విమర్శలు వెల్లువెత్తడం సర్వసాధారణం. పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, కెప్టెన్ తప్పుడు నిర్ణయాల వల్లే భారత్ ఓటమి చవిచూసిందంటూ కొందరు కావాలనే విమర్శలకు పాల్పడుతుంటారు. ఇప్పుడు రిషభ్ పంత్‌పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. రిషభ్ నాయకత్వంలో భారత్ 211 పరుగులు కొట్టినా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాల్వడంతో అతడ్ని విమర్శిస్తున్నారు. జట్టును నడిపించేంత సామర్థ్యం అతనికి లేదని, ఎవరైనా సీనియర్ ప్లేయర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రిషభ్‌కు…
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు.…