IND vs SA: నేడు రెండో టీ20.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు. బౌలర్లే తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది.
స్వింగ్ మాస్టర్ అయిన భువనేశ్వర్ తొలి టీ20లో ఆఖరి ఓవర్లలో భారీ పరుగులు సమర్పించేసుకున్నాడు. అటు, ఐపీఎల్‌లో అదరగొట్టిన హర్షల్ పటేల్ కూడా ఎక్కువ పరుగులిచ్చాడు. అవేశ్ ఖాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. హార్దిక్ బ్యాట్‌తో మెరుపులైతే మెరిపించాడు కానీ, బంతితో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు. కాబట్టి.. ఈసారి వీళ్లందరూ తమ తప్పుల్ని గ్రహించి, కట్టుదిట్టంగా బౌలింగ్ వేయాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికాలో ఉన్న బ్యాట్స్మన్లను ముప్పుతిప్పలు పెట్టాలన్నా, పెవిలియన్ చేర్పించాలన్నా.. అంత సులువైన విషయం కాదు. కాబట్టి, బౌలర్లు జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల్ని గందరగోళానికి గురి చేసేలా వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. డేవిడ్ మిల్లర్, డికాక్, డసెన్‌లను అడ్డుకుంటే.. దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించినట్టే!
Also Read
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
ఇక ఈ రెండో టీ20 బారాబటి స్టేడియం వేదికగా జరగనుంది. ఇంతకుముందు రెండు టీ20 మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యమిచ్చింది. అందులో ఒక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలోనే భారత్ 92 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో శ్రీలంకను 87 పరుగులకే భారత్ కట్టడి చేయగలిగింది. ఈ పిచ్ స్పిన్నర్లకి అనుకూలం. కాబట్టి, భారత స్పిన్నర్లకు సత్తా చాటేందుకు ఇది సువర్ణవకాశం. బ్యాటింగ్ విషయంలో ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. మరి, ఈ పిచ్‌పై భారత్ తన ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!