కటక్ వేదికగా జరిగిన భారత్,దక్షిణాఫ్రికా రెండవ టీ20 లో భారత్ భొక్కబోర్ల పడింది. తొలుత టాస్ గెలిచినా దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుండే తడపడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే గైక్వాడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తరువాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతాడనుకున్న కెప్టెన్ పంత్ కూడా అనవసరపు షాట్ ఆడీ వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్ ఇషాంత్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులతో పరవాలేదనిపించిన, మిగితా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 మాత్రమే చేయగలిగింది.
149 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన సఫారీలు భువీ బౌలింగ్ ధాటికి మొదట్లోనే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలోనే కెప్టెన్ భవుమా, క్లాసేన్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఒక తరుణంలో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా వీరిద్దరి ఇన్నింగ్స్ తో కేవలం 12 ఓవర్లోనే 93 పరుగులు చేశారు. తరువాత భవుమా అవుట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తరువాత వచ్చిన కిల్లర్ మిల్లర్ తనదైన దూకుడుతో సఫారీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. సఫారీ జట్టులో క్లాసేన్ 81 పరుగులతో మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించగా బవుమా 35 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలింగ్ లో భువీ ఒక్కడే 4 వికెట్లు తీసి రాణించాడు. 5 మ్యాచుల సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక మూడవ టీ20 జూన్ 14 న జరగనుంది.