టీమిండియా కెప్టెన్, రన్ మిషిన్ విరాట్ కోహ్లీకి ఏమైంది ? వరుసగా టెస్టుల్లో ఎందుకు విఫలమవుతున్నాడు ? హాఫ్ సెంచరీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నాడా ? కెప్టెన్‌గా ఒత్తిడిని ఎదుర్కొలేక…బ్యాట్స్‌మెన్‌గా ఫెయిల్ అవుతున్నాడా ? విరాట్ కోహ్లీ…టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్. టెస్టులైనా, వన్డేలైనా, టీ20 మ్యాచులయినా…అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీకి సాటిరారు. అలాంటి బ్యాట్స్‌మెన్ కొంతకాలంగా బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. అర్ధసెంచరీ సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. చిన్నా పెద్ద టీమ్‌లు అన్న తేడా లేకుండా…భారీ స్కోరు చేయలేక…
భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(83) పరుగులు చేయగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ(42), జడేజా(40) పంత్(37) పరుగులు చేయగా పుజారా(9), రహానే(1)తో నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ కాగా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్ లో 183 పరుగులు చేయగా భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు పుంజుకొని 303 పరుగులు చేసింది. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 20 వికెట్లు భారత పెసర్లే తీయడం విశేషం. ఇక…
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుండగా భారత టెస్ట్ స్పిన్నర్ అశ్విన్ అలాగే పేసర్ ఉమేష్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ లో మొత్తం నలుగురు పేసర్లతో బరిలోకి దిగ్గుతున్న…
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు భారత జట్టులో కరోనా కలకలం రేపినట్లు తెలుస్తుంది. జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆటగాళ్లకు మూడువారాలు…
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ప్రస్తుతం అక్కడే ఉంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అందుకోసం అక్కడే ఆగిపోయిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత యువ ఓపెనట్ శుబ్ మాన్ గిల్ గాయం బారిన పడ్డాడు. దాంతో అతను ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ కు…
భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన షెఫాలీ.. పిన్నవయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 2019లో టీ20లలో అడుగుపెట్టిన ఈ ఎక్స్‌ప్లోజివ్ ఓపెనర్ ఇంగ్లండ్‌తో ఈ నెల 16-19 మధ్య జరిగిన ఏకైక టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్ల 150 రోజులు. ఈ టెస్టులో తొలి…
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది. మధ్య వేలు, నాలుగవ వేలికి కుట్లు వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇశాంత్ గాయం అంత సీరియస్‌గా లేదని తెలిపారు. పది రోజుల తర్వాత కుట్లు తీసివేస్తారన్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండడంతో… అప్పటిలోగా ఇశాంత్ కోలుకుంటాడని…ఇంగ్లండ్ సిరీస్ కు ఇషాంత్ అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ అధికారి…
భారత ఆటగాళ్లకు శుభవార్త చెప్పిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం భారత పురుషుల జట్టు అలాగే పరిమిత ఓవర్ల సిరీస్ ల కోసం మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న భారత జట్టు కోసం క్వారంటైన్ ఆంక్షలను ఈసీబీ సడలించింది. బీసీసీఐతో జరిగిన చర్చల తర్వాత 10 రోజుల క్వారంటైన్‌ను 3 రోజులకు తగ్గించింది. దీంతో పురుషులు, మహిళల జట్లు నాలుగో రోజు నుంచే సాధన చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం…
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఇందుకోసం 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ కూడా మూడు ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనుంది. ప్రతి ఫార్మాట్‌కు 18 మందితో కూడిన…