భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(83) పరుగులు చేయగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ(42), జడేజా(40) పంత్(37) పరుగులు చేయగా పుజారా(9), రహానే(1)తో నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ కాగా మరో ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. దాంతో మొదటి రోజు 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసిన భారత్ రెండో రోజు కనీసం వంద పరుగులు కూడా చేయకుండానే మిగితా 7 వికెట్;యూ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ మరో 5 వికెట్ హల్ సాధించాడు. ఇక చూడాలి మరి ఇప్పుడు భారత బౌలర్లు ఏం చేస్తారు అనేది.