భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్ లో 183 పరుగులు చేయగా భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు పుంజుకొని 303 పరుగులు చేసింది. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 20 వికెట్లు భారత పెసర్లే తీయడం విశేషం. ఇక 209 పరుగుల లక్షయంతో నాలుగు రోజు చివరి సెషన్ లో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా 52 పరుగులు చేసి కేఎల్ రాహుల్(26) వికెట్ కోల్పోయింది. అలాగే రోహిత్(12) పుజారా(12) క్రీజులో నిలిచారు. అయితే చివరి రోజు 9 వికెట్లు చేతిలో ఉన్న భారత జట్టుకు 157 పరుగులే కావాల్సి ఉండగా వరుణుడు అడ్డుపడ్డాడు. రోజు మొత్తం వర్షార్పణం కావడంతో ఈ మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది.