ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడ్డా ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కుడి చేతి వేళ్లలో చీలిక వచ్చింది. మధ్య వేలు, నాలుగవ వేలికి కుట్లు వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇశాంత్ గాయం అంత సీరియస్‌గా లేదని తెలిపారు. పది రోజుల తర్వాత కుట్లు తీసివేస్తారన్నారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆరు వారాల సమయం ఉండడంతో… అప్పటిలోగా ఇశాంత్ కోలుకుంటాడని…ఇంగ్లండ్ సిరీస్ కు ఇషాంత్ అందుబాటులో ఉంటాడు అని బీసీసీఐ అధికారి తెలిపారు. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఇశాంత్ 31.2 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు 20 రోజుల బ్రేక్ ఉన్న కారణంగా.. టీమిండియా ప్లేయర్లు అక్కడే ఎంజాయ్ చేయనున్నారు. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆగస్టు 4వ తేదీ నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.