ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ప్రస్తుతం అక్కడే ఉంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అందుకోసం అక్కడే ఆగిపోయిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత యువ ఓపెనట్ శుబ్ మాన్ గిల్ గాయం బారిన పడ్డాడు. దాంతో అతను ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ కు ఇంకా నెల రోజుల సమయం ఉండగా అక్కడే చికిత్స తీసుకుంటున్న గిల్ పరిస్థితిని భారత ఫిజియో నితిన్ పటేల్ గమనిస్తున్నారు. అయితే ఆసీస్ సిరీస్ లో రాణించిన గిల్ తర్వాత భారత్ వేదిక ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లోను అలాగే ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోను నిరాశపరిచిన విషయం తెలిసిందే. అందుకే ఈ సిరీస్ లో గిల్ కు తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చు అని తెలుస్తుంది.