ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు భారత జట్టులో కరోనా కలకలం రేపినట్లు తెలుస్తుంది. జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆటగాళ్లకు మూడువారాలు బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలో ఆటగాళ్లు అందరూ బయటికి వెళ్లారు. ఈ క్రమంలో తాజాగా వారికి కరోనా పరీక్షలు జరపగా ఒక్కరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఆ ఆటగాడి పేరును మాత్రం బయటికి తెలుపలేదు. మరి ఈ కారణంగా ఇక బీసీసీఐ ప్లేయర్స్ కు ఇచ్చిన బ్రేక్ ను రద్దు చేస్తుందా.. లేదా అనేది చూడాలి.