టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. తొలుత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ అనంతరం వన్డేలు, టీ20లలో కూడా ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మేరకు వన్డేలు, టీ20లకు భారత జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి హార్డిక్ పాండ్యా పునరాగమనం చేశాడు. అటు గాయం నుంచి కోలుకున్న జడేజా కూడా వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల పొట్టి క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా సెలక్టర్లు భారత జట్టులో స్థానం కల్పించారు. అయితే తొలి టీ20కి.. రెండు, మూడు టీ20లకు జట్లను సెలక్టర్లు వేర్వేరుగా ఎంపిక చేయడం గమనార్హం.
వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ షమీ, సిరాజ్, అర్ష్ దీప్ సింగ్
తొలి టీ20కి జట్టు: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, హార్డిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
రెండు, మూడో టీ20లకు జట్టు: రోహిత్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్కాన్ మాలిక్
టీ20లు, వన్డేల షెడ్యూల్ ఇదీ..!
జూలై 7న సౌతాంప్టన్‌లో తొలి టీ20 జరగనుంది. జూలై 9న బర్మింగ్ హామ్‌లో రెండో టీ20, జూలై 10న నాటింగ్ హామ్‌లో మూడో టీ20 జరగనున్నాయి. జూలై 12న ఓవల్ మైదానంలో తొలి వన్డే, జూలై 14న లార్డ్స్ మైదానంలో రెండో వన్డే, జూలై 17న మాంచెస్టర్‌లో మూడో వన్డే జరగనున్నాయి.