ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రెండు రోజులు టీమిండియానే హవా చూపించింది. దీనికి కారణం ముగ్గురు మోనగాళ్లు. వాళ్లే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగితే.. వరుణుడు అంతరాయం కలిగించినా బుమ్రా పట్టుదలతో బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో జస్‌ప్రీత్ బుమ్రా మరో ఘనతను సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021-23లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 18 ఇన్నింగ్స్‌లలో 43 వికెట్లు పడగొట్టాడు.
Read Also: IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే
ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ ఉన్నాడు. అతడు 10 మ్యాచ్‌లు ఆడి 39 వికెట్లు తీసుకున్నాడు. మూడో స్థానంలో పాకిస్తాన్‌కు చెందిన బౌలర్ షహీన్‌షా అఫ్రిది ఉన్నాడు. అతడు 37 వికెట్లు సాధించాడు. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ లియోన్ (37 వికెట్లు), ఐదో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్ (34 వికెట్లు), ఆరో స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ (33 వికెట్లు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ రాబిన్‌సన్ (32 వికెట్లు), 8వ స్థానంలో వెస్టిండీస్ బౌలర్ సీల్స్ (31 వికెట్లు), 9వ స్థానంలో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ (31 వికెట్లు), 10వ స్థానంలో దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ (30 వికెట్లు) ఉన్నారు.