టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. ఇటీవల అతడికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షణ నెగిటివ్ రావడంతో రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ కఠోర సాధన చేస్తున్నాడు. భారీ షాట్లతో పాటు డిఫెన్సివ్ షాట్లు ఆడుతూ రోహిత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో అతడు త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండటం ఖరారైపోయింది.
కాగా బర్మింగ్‌హామ్ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి కొద్దిరోజుల ముందే రోహిత్‌కు కరోనా సోకింది. లీసెస్టర్‌షైర్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌లో రోహిత్ బ్యాటింగ్‌కు దిగలేదు. తాజాగా కరోనా నుంచి రోహిత్ కోలుకోవడంతో ఈ నెల 7న ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌథాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఇంగ్లండ్‌తోనే టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది.
.@ImRo45 – out and about in the nets! 👏 👏
Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a
— BCCI (@BCCI) July 4, 2022