కొంతకాలం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడంటూ విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్.. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టేశాడు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు.. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. అదే జోష్‌ను రెండో ఇన్నింగ్స్‌లోనూ కొనసాగించాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన రికార్డ్‌ని సాధించగలిగాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేసిన పంత్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. తద్వారా.. ఒకే టెస్టులో శతకం, అర్దశతకం సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ చరిత్రపుటలకెక్కాడు.
అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేసిన ఫరోఖ్, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు సాధించాడు. ఆ రికార్డ్‌ని 49 ఏళ్ల తర్వాత పంత్ తిరిగరాశాడు. అంతేకాదు.. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్‌గానూ పంత్(203) నిలిచాడు. బుద్ధి కుందరన్ 230 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయి, ఇంగ్లండ్‌కు 378 లక్ష్యాన్ని నిర్దేశించింది.