Nahid Rana About IND vs BAN Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగా ఉందని ఆ జట్టు యువ పేసర్ నహిద్ రాణా చెప్పాడు. భారత్ బలమైన జట్టే కానీ.. మెరుగ్గా ఆడిన టీమ్ గెలుస్తుందన్నాడు. భారత్‌కు వెళ్లాక చూసుకుందాం అని నహిద్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై నహిద్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో బుల్లెట్ బంతులతో ఆకట్టుకున్నాడు. 150 కిమీ వేగంతో బంతులు…
Rohit Sharma Eye on Big Record in IND vs BAN Test Series: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్ మూడు…
KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్…
Rishabh Pant About Suryakumar Yadav Catch: గత జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో ప్రొటీస్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పట్టాడు. అక్కడే మ్యాచ్ మలుపుతిరిగింది. అయితే కీపర్‌గా ఉన్న రిషబ్ పంత్ మాత్రం మిల్లర్ కొట్టిన షాట్ సిక్స్‌గానే భావించినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.…
తనకు ఎవరైనా ఇలా చేయాలి, అలా చెయ్‌మని చెబితే పెద్దగా నచ్చదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తనకే స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తే మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తాను ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనడంలో కాస్త తడబాటుకు గురయ్యానని, ఆ సమయంలో అప్పటి కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు ఇచ్చాడని పంత్ పేర్కొన్నాడు. పంత్ చివరిసారిగా 2022లో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఘోర రోడ్డు…
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారనుకున్నా.. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు…
టీమిండియా ప్లేయర్స్ 45 రోజుల విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో ఆరంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ 2024 ప్రదర్శన ఆధారంగా కొందరు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయిన భారత ప్లేయర్స్ సెప్టెంబర్ 12న చెన్నైలో సమావేశం కానున్నారు.…
Rohit Sharma at MCA Gym: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ విషయంలో తరచూ ట్రోల్ అవుతుంటాడు. హిట్‌మ్యాన్ బరువును ఉద్దేశించి.. పావ్‌బాజీ, సాంబార్ వడ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతుంటారు. చాలా సందర్భాల్లో ఫిట్‌నెస్‌పై ఇబ్బందికరమైన ప్రశ్నలను కూడా ఎదుర్కొన్నాడు. దాంతో చాలా కాలంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో జిమ్‌లో తెగ శ్రమిస్తున్నాడు. దులీప్ ట్రోఫీ 2024కి దూరంగా ఉన్న హిట్‌మ్యాన్.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)లో ఆధునికీకరించిన జిమ్‌లో ప్రస్తుతం…
రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. స్వదేశంలో పాకిస్థాన్‌ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యంలోని బంగ్లాదేశ్ జట్టులో నైతిక స్థైర్యం ప్రస్తుతం ఎక్కువగా ఉంది.
Mohammed Shami About ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరుడిగా నిలిచాడు. అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో షమీకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తానెంత…