Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..
- 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం
- అరుదైన రికార్డుపై రోహిత్ కన్ను
- అగ్రస్థానంలో పథుమ్ నిసాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Eye on Big Record in IND vs BAN Test Series: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్ మూడు ఫార్మాట్లలో 25 ఇన్నింగ్స్ ఆడి.. 990 పరుగులు చేశాడు. మరో 10 రన్స్ చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరుతుంది.
2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక బ్యాటర్ పథుమ్ నిసాంక పేరిట ఉంది. ఇప్పటివరకు నిసాంక 25 ఇన్నింగ్స్‌ల్లో 1135 రన్స్ చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుసాల్ మెండిస్ రెండో స్థానంలో (1111) ఉన్నాడు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1033) మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (990) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (986) టాప్-5లో కొనసాగుతున్నాడు.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
Also Read: Paralympic 2024: పారాలింపిక్స్ విజేతలకు భారీ నజరానా.. పసిడికి రూ.75 లక్షలు!
టెస్ట్ సిరీస్, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానుంది. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి మొదలవుతుంది. అక్టోబర్ 6న గ్వాలియర్‌లో మొదటి టీ20, అక్టోబర్ 9న ఢిల్లీలో రెండో టీ20, అక్టోబర్ 12న హైదరాబాద్‌లో మూడో టీ20 జరగనుంది. టెస్టుల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తారు.
తాజావార్తలు
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?