వన్డే, టీ20 సిరీస్‌ల కోసం త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్, అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ ఆడనున్న సిరీస్ ఇదే. దాదాపు 7 నెలల తర్వాత హిట్‌మ్యాన్ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ వన్డే పగ్గాలు అప్పగించడంతో.. రోహిత్ ఆటగాడిగా మాత్రమే…
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 19 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 29 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు తమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం…
Ind Vs Aus: బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సంచలనం బ్యాటింగ్ ని కొనసాగించగా.. వికెట్ కీపర్ అభిగ్యాన్ కుండు, వేదాంత్ త్రివేది అజేయ అర్ధ సెంచరీలతో భారత్‌కు 117 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం!…
IND vs AUS: న్యూ చండీగఢ్‌లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 102 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత వైస్-కెప్టెన్ స్మృతి మందాన తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 91…
ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పవర్‌హౌస్ అభిషేక్ శర్మ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 30 రన్స్ చేశాడు. చేసిన 30 పరుగులలో 26 రన్స్ బౌండరీల ద్వారానే వచ్చాయి. ఎలాంటి బెరుకు లేకుండా ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టాడు. అభిషేక్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దాయాది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ కూడా అభిషేక్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు.…
Virat Kohli will play ODI World Cup 2027: టీ20, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పూర్తిగా వన్డేలపై దృష్టి సారించాడు. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడడంతో.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో విరాట్ ఆడనున్నాడు. ఈ సిరీస్ విరాట్ కెరీర్‌కు చివరిది కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే తనలో ఇంకా ఆడే సత్తా ఇంకొన్నేళ్లు ఉందని కింగ్ ఓ…
భారత జట్టు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ అక్టోబర్‌లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో తమ కెరీర్‌లోని చివరి వన్డే సిరీస్ ఆడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ బాగా రాణిస్తే ఈ ఫార్మాట్‌లో ఆడటం కొనసాగించాలని ఆయన తెలిపారు. Also Read:Air India: కొత్త సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల…
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆపై ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. ఆసీస్ సిరీస్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా.. మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అక్టోబర్ 25న…
IND vs AUS: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటింది. ఈ విజయోత్సాహం మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2025-26 ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 19 నుంచి నవంబర్…
భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్…