IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు…
AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్‌ను కోల్పోయింది.
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్‌లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, పిచ్‌కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా…
IND vs AUS: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్ లలో ఇరు జట్లకు సెమీఫైనల్‌లో మూడోసారి తాడోపేడో తేల్చుకోనున్నారు. క్రితం రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో ఇరు జట్లు ఎప్పుడు తలపడ్డాయి? అందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్‌లో గెలుపు ఎవరిది అనేది చూద్దాం. Read Also: IOB Recruitment…
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే స్మిత్ పెవిలియన్‌కు చేరాడు. స్మిత్ కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకుంటాడని ఆసీస్ ఫాన్స్, క్రికెటర్స్ ఆశగా చూస్తున వేళ.. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ అతడిని ఔట్ చేశాడు. దాంతో కంగారో ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా దీనిపై స్మిత్…
ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల్లో విఫలమవుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో కోహ్లీ, రోహిత్‌లపై పలువురు టీమిండియా మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమ్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వీరికి మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు సరికావని.. గతంలో వారు ఏం సాధించారో ఫాన్స్…
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్…