Ind Vs Aus: బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరిగిన మొదటి యూత్ వన్డేలో భారత్ అండర్-19 జట్టు ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సంచలనం బ్యాటింగ్ ని కొనసాగించగా.. వికెట్ కీపర్ అభిగ్యాన్ కుండు, వేదాంత్ త్రివేది అజేయ అర్ధ సెంచరీలతో భారత్‌కు 117 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం! చిరు వ్యాపారుల కోసం కొత్త Tata Ace Gold Plus Mini Truck లాంచ్..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా U19 జట్టు భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్ లో జాన్ జేమ్స్ (68 బంతుల్లో 77*) కౌంటర్ ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా ఆ స్కోరుకు పరిమితమయ్యేది. భారత బౌలర్లలో హెనిల్ పటేల్ (3/38), కనిష్క్ చౌహాన్ (2/39), కిషన్ కుమార్ (2/59) ప్రధానంగా వికెట్లు పడగొట్టగా.. ఆర్‌ఎస్ అంబ్రీష్ (1/50) ఒక వికెట్ తీశాడు. టామ్ హోగన్ (41), స్టీవెన్ హోగన్ (39) నెమ్మదిగా ఆడినప్పటికీ భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు.
ఇక ఛేజింగ్ లో భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 7 ఫోర్లతో 38 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇందులో మాత్రే కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. హేడెన్ షిల్లర్ బౌలింగ్‌లో సూర్యవంశీ ఔటైన తర్వాత, చార్లెస్ లాచ్మండ్ రెండు బంతుల వ్యవధిలో మాత్రేను ఔట్ చేసి భారత్‌ను 50/2 కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత విహాన్ మల్హోత్రా (9) కూడా లాచ్మండ్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో భారత్ 10వ ఓవర్‌లో 75/3తో కాస్త ఒత్తిడిలో పడింది.
GST 2.0 : ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలకు ఊరట.. 28 నుంచి 18%కి రేటు కట్, ఫెస్టివల్ సేల్స్ బూస్ట్
అయితే, అభిగ్యాన్ కుండు 74 బంతుల్లో 87* (8 ఫోర్లు, 5 సిక్సర్లు), వేదాంత్ త్రివేది 69 బంతుల్లో 61* (8 ఫోర్లు) నాల్గవ వికెట్‌కు 152 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా ఆశలను నీరుగార్చారు. కేవలం 30.3 ఓవర్లలో ఇంకో వికెట్ కోల్పోకుండా భారత్ 227/3 స్కోరుతో లక్ష్యాన్ని సాధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో లాచ్మండ్ (2/46) రెండు వికెట్లు తీసినప్పటికీ, భారత బ్యాటర్ల ఆధిపత్యం ముందు వారు నిలవలేకపోయారు. కుండు తన అద్భుత బ్యాటింగ్‌తో పాటు రెండు క్యాచ్‌లు పట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో భారత్ U19 జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.