IND Vs AUS: ఆసియా కప్ వైఫల్యాన్ని భారత్ కొనసాగించింది. మొహాలీలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది. మరోసారి టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారీ లక్ష్యాన్ని సైతం ఛేదించింది. కామెరూన్ గ్రీన్ 30 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి బలమైన పునాది వేశారు. చివర్లో మాథ్యూ వేడ్ 21 బంతుల్లో 45 పరుగులు చేయడంతో 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 19.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా…
IND Vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ రోహిత్ 11 పరుగులకే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 2 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడి ఆసీస్ బౌలర్లకు కళ్లెం వేశాడు.…
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశ్చర్యకరంగా బుమ్రాను తుది జట్టులోకి తీసుకోకుండా ఉమేష్ యాదవ్‌కు అవకాశం ఇచ్చింది. అటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకుంది. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు రానున్నారు. కాగా రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్…
IND Vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా టీ20లో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు పరితపిస్తారు. అందులోనూ ఆ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతుందంటే అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నెల 25న జరిగే మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, తెలంగాణ జిల్లాల నుంచి భారీగా అభిమానులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఈ మేరకు జింఖానా గ్రౌండ్స్,…
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ…
Hyderabad: ప్రస్తుతం టీమిండియా బిజీ షెడ్యూల్‌తో క్రికెట్ ఆడుతోంది. ఇటీవల ఆసియా కప్ ఆడిన భారత్ సొంతగడ్డపై ఈనెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్, ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.…
క్రికెట్ చరిత్రలో మొదటిసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీం ఇండియా 2019-20లో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ను వారి గడ్డపై ఓడించింది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో భారత రెగ్యులర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులుగా కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చి 5 వికెట్ హల్ తో అద్భుతమైన ప్రదర్శన చేసాడు. దాంతో మ్యాచ్ అనంతరం అప్పటి టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి విదేశీ…