మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 38.3 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సిడ్నీలో దుమ్మురేపారు. రోహిత్ 125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 121 రన్స్ చేశాడు. కోహ్లీ 81 బంతుల్లో 7 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. రోకోలు చెలరేగడంతో భారత్ సునాయాస…
IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్‌ను కోల్పోయిన టీమ్‌ఇండియా.. ఈరోజు ( అక్టోబర్ 25న) జరిగే నామమాత్రమైన చివరి మ్యాచ్‌కు రెడీ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంలో క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.
Ravichandran Ashwin: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా మేనేజ్మెంట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.
IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తేలిపోయింది. అనేకమార్లు వర్షం అంతరాయం తర్వాత టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వర్షం ప్రభావంతో మ్యాచ్ 26 ఓవర్లకు పరిమితం చేయగా, టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత జట్టు ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ…
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి 223 రోజులైంది. ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత రో-కోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్…
Shubman Gill: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా.. ఇప్పటికే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు.. రేపు జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు ప్రాక్టీస్‌లో మునిగిపోయింది.. అయితే, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు.. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఇద్దరూ గిల్ నాయకత్వంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీ…
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్ ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 19న పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి వన్డేకు స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. వీరి స్థానంలో మాథ్యూ కున్నెమాన్, జోష్ ఫిలిప్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టులోకి తీసింది. ఆడమ్ జంపా సతీమణి న్యూ సౌత్…
వెస్టిండీస్‌తో భారత్ టెస్ట్ సిరీస్ ముగిసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. వన్డే సిరీస్‌లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడనున్నారు. ఐపీఎల్ 2025 తర్వాత ఇద్దరూ మైదానంలోకి దిగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీలు సన్నదమవుతున్నారు. ఆస్ట్రేలియా…
ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్…