IND vs AUS: ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మళ్లీ ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటింది. ఈ విజయోత్సాహం మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా (CA) తమ 2025-26 ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం, అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు భారత జట్టు ఆస్ట్రేలియాలో ఎనిమిది అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఎనిమిది వేర్వేరు వేదికలపై జరగనున్నాయి.
Read Also: SRH Ugadi Wishes: తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఆర్‌హెచ్ టీం.. వీడియో వైరల్
భారత్-ఆస్ట్రేలియా వన్డే షెడ్యూల్:
అక్టోబర్ 19, 2025 – మొదటి వన్డే – పెర్త్ స్టేడియం
అక్టోబర్ 23, 2025 – రెండో వన్డే – అడిలైడ్ ఓవల్
అక్టోబర్ 25, 2025 – మూడో వన్డే – ఎస్‌సీజీ (సిడ్నీ)
భారత్-ఆస్ట్రేలియా టీ20 షెడ్యూల్:
అక్టోబర్ 29, 2025 – మొదటి టీ20 – కాన్‌బెర్రా
అక్టోబర్ 31, 2025 – రెండో టీ20 – ఎంసీజీ (మెల్బోర్న్)
నవంబర్ 2, 2025 – మూడో టీ20 – హోబర్ట్
నవంబర్ 6, 2025 – నాలుగో టీ20 – గోల్డ్ కోస్ట్
నవంబర్ 8, 2025 – ఐదో టీ20 – గబ్బా (బ్రిస్బేన్)
11 cities. 26 matches. Three visiting nations up for the challenge.
Cricket is everywhere this summer. And you need to see it! pic.twitter.com/FZOm1PGj0X
— Cricket Australia (@CricketAus) March 30, 2025
భారత్ టూర్ ముగిసిన వెంటనే నవంబర్ 21న యాషెస్ 2025-26 ప్రారంభం కానుంది. ఈ మెగా సిరీస్‌లో తొలి టెస్టు పెర్త్‌లో జరగనుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా ఆగస్టులో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. భారత క్రికెట్ అభిమానులకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకం కానుంది. ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత్ తన ఫామ్‌ను కొనసాగిస్తుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత సిరీస్‌లను బట్టి చూస్తే ఆసీస్ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన చేయగలదని ఆశించవచ్చు.