BCCI: బోర్డులో ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెడీ అయింది. ఇందులో భాగంగా.. వచ్చే నెల 12న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది. ‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు…
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్లో…
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో ఛాపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్…
2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఛాన్స్ కనిపించడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నారు. నేను కూడా అసలు ఈ టోర్నీ జరగకూడదని కోరుకుంటున్నాను.. ఐసీసీ తిరస్కరించేకంటే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్దని చెప్పాలని సూచించారు.
ICC Banned NCL USA: అమెరికా జాతీయ క్రికెట్ లీగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పెద్ద షాక్ ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా అమెరికా క్రికెట్ లీగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అమెరికా క్రికెట్ లీగ్ తదుపరి సీజన్‌ను నిర్వహణకు నిరాకరించిందని ఐసీసీ తెలిపింది. ఒక్క పొరపాటు వల్ల ఈ అమెరికన్ క్రికెట్ లీగ్ భారీ నష్టాలను చవిచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Neelam Bhardwaj: చరిత్ర సృష్టించిన నీలం..…
Sunny Dhillon: యూఏఈలో జరుగుతున్న అబుదాబి టీ-10 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ ఓ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్‌పై ఐసీసీ 6 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Rishabh Pant Got Injured: గాయపడ్డ రిషబ్ పంత్.. మూడో టెస్టులో ఆడుతాడా? అబుదాబి T10…
టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ (ICC) షాక్ ఇచ్చింది. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, భారత ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
2025లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధతకు తెరదించేలా ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. భారత మ్యాచ్‌లకు వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసిందని అనేక కథనాలు వస్తున్నాయి.