వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ విముఖత వ్యక్తం చేసినట్లు ఐసీసీకి తెలియజేసినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆదివారం ధృవీకరించింది. ఐసీసీ ఈ-మెయిల్‌పై పీసీబీ స్పందించలేదు. ఐసీసీ నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా అందినప్పుడే పాకిస్తాన్ తన విధానాన్ని వెల్లడిస్తుందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ శుక్రవారం చెప్పారు.
ఇటీవలి కాలంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు సిరీస్‌లను ఆడింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులను, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులను ఆడింది. బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌పై మాత్రం ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్‌లను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో ఒక్క పిచ్‌కు మాత్రమే మంచి రేటింగ్ వచ్చిందట. మిగతా నాలుగు పిచ్‌లు మాత్రం పాస్ అయినట్లు తెలుస్తోంది. Also Read: Venu…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లకు గొప్ప సన్మానం చేసింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ లో భాగంగా.. నిన్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు అరుంధతి దోషిగా తేలింది.
T20 World Cup 2024 Female Panel of Match Officials: అక్టోబరు 3 నుంచి 20 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మహిళల టీ20 ప్రపంచకప్ 2024 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ కోసం అంపైర్ల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. టోర్నీ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు రిఫరీలను ఐసీసీ అధికారులు నియమించారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. అందరూ…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లి నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.
Womens T20 Worldcup 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌తో ఇది ప్రారంభమవుతుంది. ఐసీసీ ప్రకటన ప్రకారం.. మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఇకపై 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అందుతాయి. గతేడాది దక్షిణాఫ్రికాలో ఆడిన మహిళల టీ20…
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.
ODI World Cup 2023 India Economic Benefit: 2023 అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ అభిమానులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రత్యక్షంగా వీక్షించారు. వన్డే ప్రపంచకప్ భారత్‌కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే…
PCB Chairman Mohsin Naqvi About Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రావడం తమకేమీ ఆందోళన కలిగించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోసిన్ నక్వీ అన్నారు. జై షాతో తాము టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరగనుందని మోసిన్ స్పష్టం చేశారు. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా…