తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. టోర్నీ షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే తాము ఆడేందుకు సిద్ధమని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఇందుకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. పాకిస్థాన్‌లోనే పూర్తి టోర్నీ జరగాలని పట్టుపడుతోంది. ఐసీసీ చర్చలు జరిపినా.. పాక్ వెనక్కి తగ్గడం లేదు. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి పీసీబీ స్పష్టం చేసింది. ఇందుకు…
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది.
Cricket Umpire: భారతదేశంలో క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు. ఒక మతంలా మారింది. ప్రస్తుతం ఈ ఆటలో భారతదేశం ఆధిపత్య దేశంగా మారింది. భారత్ లాంటి క్రికెట్ ను ఇష్టపడే దేశంలో చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడే ఆటగాళ్లు ఏదో ఒక రోజు టీమిండియా తరఫున క్రికెట్ ఆడాలని కలలు కంటారు. అయితే, అందరూ భారత క్రికెట్ జట్టులో చేరలేరు. అయితే క్రికెట్‌కు సంబంధించి ఇంకా అనేక ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి క్రికెట్ సంబంధిత ఉద్యోగాలలో…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ…
వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో.. గ్లోబల్ బాడీ ఆఫ్ క్రికెట్ పీఓకేను చేర్చని సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్‌ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల…