ఈ నెల 19 నుండి పాకిస్తాన్-దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. అనేక వివాదాలు, సన్నాహాల్లో జాప్యాల తరువాత పాకిస్తాన్ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఐసీసీ ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రసిద్ధ గాయకుడు అతిఫ్ అస్లామ్ పాడిన ‘జీతో బాజీ ఖేల్ కే’ తాజాగా విడుదల చేశారు. ఈ పాటను అబ్దుల్లా సిద్ధిఖీ రూపొందించగా.. అద్నాన్ ధూల్, అస్ఫాండ్యార్ అసద్ లిరిక్స్ రాసారు. ఈ పాటను పాకిస్తాన్ వీధుల్లో, స్టేడియాలు, మార్కెట్లలో చిత్రీకరించారు. ఆటపట్ల ఉన్న ప్రేమ, ఉల్లాసాన్ని ఈ వీడియో గొప్పగా ప్రదర్శిస్తుంది. ఈ పాటను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ స్ట్రీమింగ్ ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉంచారు.
Read Also: Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్
ఈ సందర్భంగా గాయకుడు అతిఫ్ అస్లాం మాట్లాడుతూ.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ‘నేను క్రికెట్‌కు గొప్ప అభిమాని. క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నాను. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అధికారిక గీతంలో భాగమవ్వడం నాకు గౌరవంగా ఉంది. ముఖ్యంగా భావోద్వేగాలతో నిండిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ పాట ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని నమ్ముతున్నాను” అని అతను చెప్పాడు. భారతదేశంలో కూడా అతిఫ్ అస్లామ్ తన పాటలతో సంచలనం సృష్టించాడు. అతని పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ పాటలో కూడా అతిఫ్ తన గానంతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించాడు.
Read Also: Kishan Reddy : ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు ఈ పాట మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రత్యేకంగా ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అభిమానుల మధ్య గొప్ప ఉత్కంఠను తీసుకురానుంది. స్టేడియంలలో ప్రేక్షకుల సందడి, ఈ పాటతో మరింత ఆహ్లాదంగా మారనుంది. ఇదిలా ఉంటే.. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్ వెళ్లడానికి ఇండియా భద్రత కారణంగా నిరాకరించింది. దీని కారణంగా వివాదం చెలరేగింది. దీంతో.. ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఇండియా సెమీ-ఫైనల్స్, ఫైనల్స్‌కు చేరుకున్నా.. ఈ మ్యాచ్‌లు దుబాయ్‌లోనే జరగనున్నాయి. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
The wait is over! 🎉
Sing along to the official song of the #ChampionsTrophy, Jeeto Baazi Khel Ke, featuring the master of melody @itsaadee 🎶🏆 pic.twitter.com/KzwwylN8ki
— ICC (@ICC) February 7, 2025