రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ ఎపిసోడ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలిస్టులు ఎవరనే దానిపై విశ్లేషణ చేశాడు. ఈ సందర్భంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియా అడుగు పెడతాయని చెప్పుకొచ్చాడు. ఈ రెండు టీమ్స్ ఇప్పటికే చెరో రెండు సార్లు ఈ ట్రోఫీని దక్కించుకున్నాయని రిక్కీ పాటింగ్ అన్నారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ (2024) అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ పురస్కారం కోసం బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. 2024లో భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో బుమ్రా అత్యంత కీలక ప్రాత పోషించాడు. మరోవైపు గతేడాది టెస్టుల్లో స్వదేశం, విదేశం అని…
వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పనులన్నీ వదులుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్…
జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్…
అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ని ప్రకటించింది. కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు.
ICC U-19 Womens World Cup: మహిళల క్రికెట్లో మరో మెగా టోర్నమెంట్ కు సిద్ధమైంది. మలేసియా వేదికగా ఈరోజు ( జనవరి 18) అండర్-19 టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 16 జట్లు నాలుగు గ్రూప్లుగా విడిపోయి పోటీ పడబోతున్నాయి.
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
డిసెంబర్ 2024 నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.