వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘాన్ కి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 37.2 ఓవర్లలో 156 పరుగులకి బంగ్లాదేశ్ బౌలర్లు ఆలౌట్ చేశారు.
టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. రేపు వరల్డ్ కప్ లో భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, మ్యాచ్ కి ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ పోటీలో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూస్తే అలాంటి సీన్ ఏదీ కనిపించలేదు.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ టీమ్స్ రెండు తలపడుతున్నాయి. అయితే, రెండు జట్లు వన్డే ఫార్మాట్ లో హేమాహేమీలే.. కానీ, 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ అతిపెద్ద స్టేడియంలో ప్రేక్షకులు అక్కడొకరు, ఇక్కడొకరు ఉన్నట్టుగా కనిపించారు.
World Cup 2023: భారతదేశం ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ప్రపంచకప్ మ్యాచుల్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే విదేశీ జట్లు భారత చేరుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచును టార్గెట్ చేస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదులు రభస చేయాలని చూస్తున్నారు.
Kapildev: స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అంటూ రెండు రోజులుగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇద్దరు వ్యక్తులు.. కపిల్ దేవ్ చేతులు, నోరు కట్టేసి.. ఆయనను లోపలి తీసుకెళ్తుండగా.. కపిల్ వెనక్కి తిరుగుతూ బయపడతు కనిపించాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023ను టోర్నమెంట్ ను పాకిస్థాన్ జట్టు బహిష్కరించాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా ఆసియా కప్ ను పాక్ లో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. వరల్డ్ కప్ లో పాక్ టీమ్ భారత్ లో ఎందుకు ఆడాలనే ప్రశ్న తలెత్తనుంది. అయితే, పాక్ ప్రభుత్వంతో జరుగుతున్న పరిణామాలను భట్టి చూస్తుంటే వరల్డ్ కప్ ఆడేది అనుమానంగానే ఉంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు దాయాది జట్టును పంపించడంపై…
దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది.