వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘాన్ కి బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను 37.2 ఓవర్లలో 156 పరుగులకి బంగ్లాదేశ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. ఆఫ్ఘాన్ బ్యాటింగ్ లో కేవలం ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్ తప్పప మిగతా వారు అత్యుత్తమ ప్రదర్శన చూపించలేదు. 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు.
Read Also: Cyberabad CP: తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం..
మరో బ్యాటర్ ఇబ్రహీం జాద్రాన్ 25 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేయగా రెహ్మత్ షా 18, ఆఫ్ఘాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 18, నజీబుల్లా జాద్రాన్ 5, మహ్మద్ నబీ 6, అజ్మతుల్లా ఓమర్జాయ్ 22, రషీద్ ఖాన్ 9, ముజీబ్ వుర్ రహీం 1, నవీన్ ఉల్ హక్ డకౌట్ అయ్యాడు. ఇక బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ మూడేసి వికెట్లు తీయగా షోరిఫుల్ ఇస్లాం 2 వికెట్లు తీశారు. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లకు చెరో వికెట్ దక్కింది..
Read Also: Unstoppable Limited Edition: బాలయ్య దిగుతున్నాడు.. గెట్ రెడీ రా అబ్బాయిలూ!
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒకానొక దశలో ఆఫ్ఘాన్ బౌలర్లు పుంజుకున్నారు. 27 పరుగులకే 2 వికెట్లు తీశారు. తంజీద్ హసన్ 5 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. లిటన్ దాస్ 13 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో కలిసి మూడో వికెట్‌కి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 73 బంతుల్లో 5 ఫోర్లతో 57 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్, నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరలో 59 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో .. బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. ఇక బంగ్లాదేశ్ తర్వాతి మ్యాచ్ లో అక్టోబర్ 10న ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఆఫ్ఘానిస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌ని అక్టోబర్ 11న టీమిండియాతో ఆడుతుంది.