Rahul Dravid: సొంతగడ్డపై అక్టోబర్ లో ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కోసం టీమిండియా సిద్ధమైంది. ఇప్పటికే ఆసియా కప్ 2023 గెలిచి మంచి జోరుమీదున్న భారత్.. ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే వరల్డ్ కప్ కు ముందు భారత్.. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. 27 వరకు జరగనుంది. అయితే ఈ సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు.
Read Also: JP Nadda: రాహుల్ గాంధీకి ట్యూటర్లు సాయం చేయరు.. జేపీ నడ్డా ఫైర్..
ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, కోహ్లీ వరల్డ్ కప్ వరకు మరింత నూతన శక్తితో సిద్ధంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని తెలిపాడు. ఎప్పుడు మ్యాచ్ లు ఆడుతుంటే పోతే.. తగినంత విశ్రాంతి దొరకదని, అంతర్జాతీయ షెడ్యూల్ లో తగినంత విశ్రాంతి లభిస్తే మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉంటారని అభిప్రాయపడ్డారు.
Read Also: Ontari Gulabi: గణేష్ నవరాత్రి పందిళ్ళలో సీరియల్ తారల సందడి
వీరిద్దరితో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అందులో హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనుండగా.. మూడో వన్డేలో విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు చేరనున్నారు.