ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ అంటే టోర్నమెంట్ కి కిక్కేచ్చేలా ఉంటుంది. ప్రేక్షకుల హంగామ మధ్య, ఇరు జట్లు ఉత్సాహంతో బరిలోకి దిగితే ఆ మజాయే వేరు.. కానీ, ఇవాళ భారత్ లో ప్రారంభమైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ చూస్తే అలాంటి సీన్ ఏదీ కనిపించలేదు.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, గత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ టీమ్స్ రెండు తలపడుతున్నాయి. అయితే, రెండు జట్లు వన్డే ఫార్మాట్ లో హేమాహేమీలే.. కానీ, 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ అతిపెద్ద స్టేడియంలో ప్రేక్షకులు అక్కడొకరు, ఇక్కడొకరు ఉన్నట్టుగా కనిపించారు. దాదాపు స్టేడియం మొత్తం ఖాళీగానే ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇక, భారత్ లో వరల్డ్ కప్ టోర్నమెంట్ సన్నాహాలు ఆలస్యంగా స్టార్ట్ కావడం, టికెట్ల బుకింగ్ లో సమస్యలు కూడా ప్రేక్షకుల లేకపోవడానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్ లంటే కొన్ని నెలల ముందుగానే టికెట్లు మొత్తం అయిపోవడం గతంలో జరిగింది. కానీ, ఇవాళ్టి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్ కు ఇప్పటికీ వెబ్ సైట్లో టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. నిర్వాహకుల సన్నద్ధత లేమికి ఇది నిదర్శనం అని విమర్శలు వస్తున్నాయి.
Read Also: Abhishek Singh: ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా.. కారణం ఇదేనా..?
కాగా, గుజరాత్ లో బీజేపీ ఈ మ్యాచ్ కోసం 40 వేల సీట్లను రిజర్వ్ చేసుకున్నట్టు నిర్ధారించింది. ఇటీవల కేంద్ర మహిళా బిల్లును ఆమోదించుకున్నందుకు ఆ 40 వేల టికెట్లను మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తామని.. వారికి ఫ్రీగా లంచ్, టీ కూపన్లు కూడా అందిస్తామని చెప్పింది. కానీ, ఆ 40 వేల టికెట్ల సంగతి ఏమైందో ఏమో మరి. ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ కు ప్రారంభ వేడుకలు లేకుండానే పోటీలు స్టార్ట్ కావడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
Really hope the Stadium gets filled a bit by evening.
The World Cup opener deserves more public on the stands! pic.twitter.com/oDknm9qEGD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023