దాయాది దేశం పాకిస్థాన్ మాట మార్చింది. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటుంది. ఇండియాలోని 12 నగరాల్లో జరుగబోయే ఈ మెగా టోర్నీలో భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్ కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్ లు ఆడతామని పాకిస్థాన్ చెబుతుంది. ఈ మేరకు పాక్.. ఐసీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. అయితే వరల్డ్ కప్ కు సంబంధించి అన్నీ మ్యాచ్ లను ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఇండియా ఛాన్స్ ఇస్తే.. కోల్ కతా, చెన్నై లాంటి ప్రదేశాల్లో ఆడడానికి పాక్ ఇష్టపడుతోంది.
Read Also : MP K Laxman : కేటీఆర్ నేనే తెలివిమంతున్ని అనుకుంటున్నారు
2016లో కోల్ కతాలో పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడింది. అక్కడి సెక్యూరిటీ పాక్ కు నచ్చింది. అలాగే చెన్నైలో కూడా పాకిస్థాన్ కు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. దీంతో చెన్నై వేదిక కూడా తమకు సురక్షితమని పాక్ టీమ్ భావిస్తుంది. ఈ మెగా ట్రోర్నీలో ముఖ్యమైన ఘట్టం.. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తే చాలా డబ్బులు వస్తాయని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఐసీసీ ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ చేస్తేనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
Read Also : Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..
ఐసీసీ ఈవెంట్స్ కమిటీ.. ఆతిథ్యం దేశం క్రికెట్ బోర్డు బీసీసీఐతో కలిసి కొన్ని నెలల్లో వరల్డ్ కప్ ప్రణాళిక రూపొందిస్తాయి.. దానికి అనుగుణంగా అభిమానులు వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు.. ఆసియా కప్ తాము తటస్థ వేదికల్లో ఆడతామని ఇంతకుముందు భారత్ కు తేల్చి చెప్పింది. దీంతో తమ దేశంలో భారత్ ఆసియా కప్ ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో వన్డే వరల్డ్ కప్ ఆడబోమని పాకిస్థాన్ చెప్పింది. ఆ తర్వాత తమ వరల్డ్ మ్యాచ్ ను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లో వేదికల్లో నిర్వహించాలని షరతులు సైతం విధించింది. అయితే ఇక ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ ససేమిరా ఒప్పుకోదని పాక్ బోర్డు ఇప్పుడు మాట మార్చింది.
Read Also : Most Viewed Photo : ప్రపంచంలోనే ఎక్కువమంది చూసిన ఫోటో ఇదే..!
భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఫైనల్ తో సహా 46 మ్యాచ్ లకు దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాలు వేదిక కానున్నాయి. అండులో పాకిస్థాన్ కోరుకుంటున్న చెన్నై, కోల్ కతాతో పాటు.. అహ్మదాబాద్, లక్న్, ముంబై, రాజ్ కోట్, బెంగళూరు, ఢిల్లీ, ఇండోర్, గువాహటి, హైదరాబాద్, ధర్మశాల ఉన్నాయి.