టీమిండియా జట్టులో కలవరం మొదలైంది. రేపు వరల్డ్ కప్ లో భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, మ్యాచ్ కి ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. యంగ్ బ్యాటర్, ఓపెనర్ శుభ్‌గిల్ కి డెంగ్యూ జర్వం బారిన పడ్డాడు. ఇక, నేడు నెట్ ప్రాక్టీస్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా గాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో బౌన్సర్ వేయడంతో పాండ్య చేతి వేలికి గాయం కావడంతో అప్పుడే ప్రాక్టీస్ సెషన్ నుంచి వెళ్లిపోయాడని టీమ్ యాజమాన్యం తెలిపింది.
దీంతో ఆసీస్‌తో మ్యాచ్‌కు వీరిద్దరు అందుబాటులో ఉంటారో లేదో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: 2019-2003 వరల్డ్ కప్.. ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ వివరాలు ఇవే..!
ఇక శుభ్ మన్ గిల్ డెంగ్యూ జ్వరం నుంచి కోలుకునేందుకు వారం నుంచి పది రోజుల సమయం పడుతుండటంతో.. ఈ నెల 14న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ వరకు అందుబాటులో ఉండడం సాధ్యం కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందే గాయపడి… వరల్డ్ కప్ కి అక్షర్ పటేల్ దూరం కావడంతో అతడి స్థానంలో రవీచంద్రన్ అశ్విన్ కి తుది జట్టులో స్థానం దొరికింది. అయితే, శుభ్ మన్ గిల్ దూరమైతే.. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్.. టీమిండియా సారథి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: Russia: కిమ్-పుతిన్ భేటీ తర్వాత పెరిగిన రైళ్ల రాకపోకలు.. కారణం అదేనా..?
ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు ప్రస్తుతం అతడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు.. ఇక, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ గా వచ్చి.. ఇషాన్ కిషన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించే అవకాశం కూడా లేకపోలేదు.. అయితే, హార్దిక పాండ్యా దూరం ఐతే, టీమిండియాకి పెద్ద లోటు.. హార్దిక్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కి అవకాశం దక్కనుంది.. ఆల్ రౌండర్ కాబట్టి.. శార్దూల్ కూడా ఫామ్ లో ఉన్నాడు.